తెలంగాణ రాష్ట్రంలోని జాబితాలోని మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మాదిగల సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జాబితాలో అత్యధికంగా మాదిగలు ఉన్నందున ఏడు శాతం రిజర్వేషన్ సరిపోదు అన్నారు షెడ్యూల్ కులాల్లో గల 59 ఉపకులాల్లో మాదిగలే అత్యధికంగా ఉన్నారన్నారు షెడ్యూలు కులాలను ఏబిసిడిలుగా వర్గీకరించి ఏ కు 6% ,బి కు 7 శాతం, సి కు 1శాతం, డి కు 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలోని మాదిగలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలోని 33 జిల్లాల జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలోని మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కోసం తాను పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వివేక్ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు మంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి తీసుకోవాలని మాదిగల 12 శాతం రిజర్వేషన్ కు అడ్డు పడవద్దని హితవు పలికారు 12 శాతం రిజర్వేషన్ కొరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు తిరిగి మాదిగలను చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మాజీ సర్పంచ్ శ్రీనివాసరావును సూర్యాపేట జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షునిగా ప్రకటించారు. కాగా మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో పిడమర్తి రవికి ఘన స్వాగతం పలికారు
ఈ సమావేశంలో మాదిగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవిందరావు, మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకులు కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ భర్త బెజవాడ శ్రవణ్, పిడమర్తి దశరథ , రాహుల్ ,వేణు, లాజర్, గోపి రవి ,చింతా కుమార్ పాల్గొన్నారు…