ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ అమ్మవారి పండుగను ఘనంగా జరుపుకోవాలని అమ్మవారి కరుణా కటాక్షంతో పట్టణం అన్ని రంగాల్లో దినదిభివృద్ధి చెందుతుందని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పైడిమర్రి వెంకటనారాయణ, రామినేని శ్రీనివాసరావు, ఈదుల కృష్ణయ్య, కేఎల్ఎన్ ప్రసాద్, డాక్టర్ బ్రహ్మం, హాస్పిటల్ సూపరిండెంట్ దశరథ, కమిషనర్ రమాదేవి సుశీల రాజు తదితరులు పాల్గొన్నారు……….