Tnrnews.in
తెలంగాణ

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం ముత్యాలమ్మ పండుగ సందర్భంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎడ్ల బండి ప్రభను ముస్తాబు చేసి భారీ ఊరేగింపుతో ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు పాడి పంటలకు ఆయుర్ ఆరోగ్యాలకు గ్రామదేవతల ఆశీస్సులు ఉండాలన్నారు ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. పట్టణ ప్రజలకు ముత్యాలమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి ప్రభ ముస్తాబుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడ్ల బండి భారీ ప్రదర్శనతో పట్టణంలో గత సంస్కృతి సంప్రదాయాలు కనిపించాయి ప్రజలంతా ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. కాగా తొలుత ఎర్నేని ఇంటి వద్ద ప్రభ బండి ను టీపీసీసి డెలిగేట్ సీహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రావేల కృష్ణారావు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాట సీపీఎం

Harish Hs

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

Harish Hs

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

వర్గీకరణ అమలుకై ఐక్యంగా పోరాడుదాం

Harish Hs

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

నేడు వామపక్ష నేతలతో కలిసి లగచర్ల పర్యటన,*   *భాధిత రైతులకు అండగా నిలుస్తాము,*   *విదేశీ సంస్థలకు భూములప్పగించేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు,*   *కేసీఆర్ అహంకార విధానాలనే అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి,*   *బిజెపి అనుసరించే మతోన్మాద విధానాలపై పార్టీ నిరంతరం పోరాటం,*   *కలెక్టర్, అధికారులపై దాడి కరెక్ట్ కాదు….సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.*

TNR NEWS