రామగుండం అర్బన్ డెవలప్ మెంట్ స్థానంలో పెద్దపల్లి అర్బన్ డెవలప్ మెంట్(పుడ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పుడ సాధన సమితి ఆద్వర్యంలో సోమవారం పెద్దపల్లి బంద్ కు పిలుపునిచ్చారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణదారులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ చేయాలని పిలుపునిచ్చిన కూడా వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు తెరిచే ఉన్నాయి. పెద్దపల్లి పట్టణ బంద్ అసంపూర్తిగా జరిగింది.