సూర్యాపేట:భారత స్వాతంత్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన మహనీయుల చిత్రపటాలతో కూడిన ఎగ్జిబిషన్ ను ఈనెల 5న దురాజ్ పల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్నామని ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆవాస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరంలో హిందువులు, ముస్లింలు ఐక్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. వేలాది మంది ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను అర్పించి, దేశభక్తిని చాటారని అన్నారు. స్వాతంత్ర సమరయోధులు చేసిన గొప్ప త్యాగాలను విస్మరించి, ముస్లింల దేశభక్తిని ప్రశ్నించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ అవాస్తవ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు, స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఆవాజ్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు.ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ (ఐపీఎస్) హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆవాస్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ షాకీర్ హుసేని, మహమ్మద్ జానీ పాషా, మహమ్మద్ జమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.