సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గల మహర్షి డిగ్రీ కళాశాలలో ఆదివారం స్నేహితుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ పల్లె నగేష్,కరస్పాండెంట్ నారాయణ ప్రవీణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జిన్నె రమాదేవి మాట్లాడుతూ అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో విలువైనది,సృష్టిలో అత్యంత మధురమైనది స్నేహమని అన్నారు.ప్రపంచంలో స్నేహానికి మించింది ఏమీ లేదని, స్నేహం ఒక్కటే శాశ్వతమని తెలిపారు. కులాలకు, మతాలకు అతీతమైనది స్నేహమని అన్నారు.విద్యార్థులంతా కలిసి స్నేహితుల దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.