కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అభినయ్, కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు లు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని 15 వ వార్డులో మండల పరిషత్ పాఠశాలలో చదువుకునే 75 మంది పేద విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు అజీమ్ ఆధ్వర్యంలో బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా యూత్ కాంగ్రెస్ సభ్యులు సేవా కార్యక్రమాలు చేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. దానగుణం కలిగి ఉన్న అజీమ్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అభినయ్, కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు అజీమ్, ముస్లిం మైనార్టీ డివిజన్ అధ్యక్షులు షేక్ బాజన్, మాజీ కౌన్సిలర్లు షాబుద్దీన్, షఫీ పాఠశాల హెచ్ఎం భూపాల్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ విజయ్ తదితరులు పాల్గొన్నారు…….