ఇంటర్మీడియట్ చదివే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండి స్నేహపూర్వకంగా మెలగాలని కోదాడ పట్టణానికి చెందిన ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి అన్నారు. కాలేజ్ కు చెందిన గర్ల్ క్యాంపస్ లో బుధవారం జూనియర్ ఇంటర్ విద్యార్థులకు సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఫ్రెషర్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పూర్తి చేసి కొత్తగా కాలేజ్ లో ప్రవేశించే విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. సీనియర్స్, జూనియర్స్ మధ్య స్నేహ పూర్వక వాతావరణం కల్పించేందుకు ఫ్రెషర్ పార్టీ లు తోడ్పడతాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వేణుగోపాల్, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, వైస్ ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ(జీ వీ), పలువురు అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.