పెద్ద గూడూరు మండలం :- మహాబూబాబాద్ జిల్లా, స్థానిక జెడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాల గూడూరులో మండల స్థాయి గణిత ప్రతిభా పోటీలు, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు గణిత టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో నాన్ రెసిడెన్షియల్ లో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు బి. పరమేశ్వరి, టీ. మనిషా, కే.బన్నీ, జెడ్ పి హెచ్ ఎస్ తీగల వేణి విద్యార్థులు సాధించారు. రెసిడెన్షియల్ విద్యార్థులలో ప్రథమ, ద్వితీయ బహుమతులు జి. సిద్దు, బి. రఘురాం, టీ డబ్ల్యూ ఏ హెచ్ ఎస్. సీతానాగారం విద్యార్థులు సాధించారు. తృతీయ బహుమతి జి. రక్షిత, మహాత్మ జ్యోతిబాపూలే గూడూరు విద్యార్థిని గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీఎస్ఎస్ బాలికల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు పి. హరి శంకర్, జి. శ్రీనివాస్, డి. రమేష్, పురుషోత్తం, రాజేందర్, రాజ్యలక్ష్మి, కళ్యాణి, రమణ, యాకలక్ష్మి, ప్రమీల పాల్గొన్నారు.
next post