మొక్కలను తోబుట్టువులుగా భావించి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ ఆవరణలో వృక్ష బంధన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిలోని చరాచర జీవులు సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. విజయీ భవ ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు చారుగాండ్ల ప్రవీణ రాజశేఖర్, ఓరుగంటి ప్రభాకర్, వెంపటి వెంకటరమణ, పత్తి నరేందర్, వెంపటి ప్రసాద్, గుడుగుంట్ల సాయి తదితరులు పాల్గొన్నారు………