మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లకు కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటామని మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు ఆదివారం కోదాడ పట్టణంలోని 12వ వార్డులో కోదాడకు 50 కోట్ల నిధుల తో నవోదయ విద్యాలయం ఏర్పాటు,16.89 కోట్ల రూపాయలతో కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకీకరణకు నిధులు మంజూరు చేయించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రెండు నియోజకవర్గాలు నేడు మంత్రి ఉత్తం ఎమ్మెల్యే పద్మావతి నాయకత్వంలో రాష్ట్రంలోనే గుర్తింపు పొందుతూ రెండు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అవినీతికి వ్యతిరేకంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి లు నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఎప్పటికి ఉంటారన్నారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు మూడున్నర కోట్లతో సిటీ స్కాన్ పరికరం కూడా మంజూరు చేయించారని ఇకపై పేద ప్రజలకు వేల రూపాయల ఖర్చు తగ్గి ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేటర్ స్థాయి వైద్యం అందుతుందన్నారు. కోదాడ వార్డు ల్లో ఏ సమస్యలు ఏవి ఉన్న మంత్రి ఉత్తం, ఎమ్మెల్యే పద్మావతి ల సహకారంతో వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఖాజా, చందా నిర్మలా, వేమూరి విద్యా సాగర్, అనీల్, చామర్తి బ్రహ్మం,రావెళ్ళ కృష్ణారావు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.