సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చట్టాల పై అవగాహన అవసరమని స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామపంచాయతీ ఆవరణంలో ప్రజలకు సైబర్ నేరాలపై, డ్రగ్స్, గంజాయి,సీసీ కెమెరాల వినియోగంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..డయల్ 100, రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, ఫోక్సో కేసుల పర్యావస నాలు,సీసీ కెమెరాల ఉపయోగాలపై ప్రజలకు వివరించారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా డయల్ 100ను ఉపయోగించుకోవాలని సూచించారు.ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు వివిధ కుల సంఘాల వారు ముందుకు రావాలని,ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని వెల్లడించారు.మైనర్ బాలికలను లైంగికంగా, మానసికంగా వేధించిన వారిపై ఫోక్సో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు పంపించే మెసేజ్‌లకు స్పందించి మోసపోవద్దన్నారు.ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు.మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, అలాంటి పక్షంలో తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని వెల్లడించారు.అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చట్టరీత్య కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. మోటార్ సైకిల్ నడిపే వ్యక్తితో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి బ్రహ్మ రెడ్డి, గ్రామ ప్రజలు మునగాల పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

previous post
next post