కోదాడ కేంద్రానికి జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయడం అభినందనీమని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లె పల్లి వెంకటేశ్వర్లు అన్నారు మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర నిటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మాత్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కృషి ఫలితంగా జవహర్ నవోదయ స్కూల్ కి 50 కోట్లు మంజూరు కావడం జరిగింది. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ ఉండి వెనుకబడి పోతన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన సి బి.ఎస్ ఈ విద్యను అందించాలని లక్ష్యంతో కోదాడ నియోజకవర్గానికి జవహర్ నవోదయ స్కూల్ ని మంజూరు చేయించడం జరిగింది ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంతోపాటు భోజనం వసతి పాఠ్యపుస్తకాలు దుస్తులు అందించి అక్షరాస్యతతో భారతదేశంలోనే కోదాడ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలుపుటకు మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కృషి మరువలేనిదని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కోట ప్రవీణ్ జిల్లేపల్లి నాగి జె నరేష్ జె. వినయ్ తదితరులు పాల్గొన్నారు