Tnrnews.in
తెలంగాణరాజకీయం

*కులదురహంకార హత్యకి*  *పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి…*  *కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి డిమాండ్…*

కులాంతర వివాహం చేసుకుందని అగ్రకుల దురహంకారంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నాగమణిని కుల దురహంకార హత్య చేసిన తన సోదరుడు పరమేష్ ను తక్షణమే పోలీసులు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. ఈరోజు ఎం.వి.ఎన్ భవన్ లో జరిగిన కెవిపిఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం

మండలం రాయపోలు గ్రామానికి చెందిన కొంగరి నాగమణి అనే కానిస్టేబుల్ నవంబర్ 10న యాదగిరి గుట్టలో శ్రీకాంత్ అనే దళిత యువకుడిని కులాంతర వివాహం చేసుకుందనీ అన్నారు. నాగమణికి తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకోవడమే కాకుండా తల్లితండ్రులు సంపాదించిన ఆస్తి లో వాటా తీసుకుంటుందని నాగమణి తమ్ముడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనీ అన్నారు.తక్కువ కులం వాడిని పెళ్లిచేసుకుంటావా అంటూ డ్యూటీ కి వెళ్తున్న కానిస్టేబుల్ నాగమణినీ తోబుట్టువైన తన తమ్ముడు పరమేష్ కారుతో వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టి వేట కోడవలితో నరికి చంపాడని ఈ దారుణ ఘటన అగ్రకులదురహంకారం తో జరిగిందని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సహo లేక పోవడంతో ఇలాంటి కులదురహంకార హత్యలు బహిరంగంగా జరుగుతున్నాయని వారు అన్నారు.

గతంలో మిర్యాలగూడకు చెందిన మారుతి రావు తన బిడ్డ అమృత తక్కువ కులానికి చెందిన ప్రణయ్ ని పెళ్లి చేసుకుంటే అతికిరాతకంగా చంపాడు, అదే రూపంలో ఈరోజు నాగమణి తమ్ముడు పరమేష్ కూడా కులదురహంకార హత్యకు పాల్పడ్డాడనీ తెలిపారు.ఈ కుల దురహంకార హత్యను కెవిపిఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. ఈ హత్యకు ప్రోత్సహించిన వారిని హత్య చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేవిపిఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశుందన్నారు.. దళితుడి వివాహం చేసుకున్నందుకు హత్య చేసిన పరమేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యానేరం కింద కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగమణి భర్త శ్రీకాంత్ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ శ్రీకాంత్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని. డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు జిల్లా నాయకులు నందిగామ సైదులు నాగమణి సుధాకర్ దుర్గారావు గిరి రమణ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నేడు మునగాల లో విజ్ఞానోత్సవం

TNR NEWS

ఈ నెల 7 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

TNR NEWS

చారిత్రాత్మకం కాంగ్రెస్ ప్రభుత్వ సన్నబియ్యం పథకం

TNR NEWS

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

TNR NEWS

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు

TNR NEWS

జూలై 20 కలెక్టరేట్ ధర్నాన్ని జయప్రదం చేయండి. – బీసీడబ్ల్యూయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముదాం శ్రీనివాస్

TNR NEWS