వెల్ఫేర్ బోర్డు పెండింగ్ లో ఉన్న క్లైమూలకు నిధులు విడుదల చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వం డిమాండ్ చేశారు.
ఆదివారం మునగాల భవన నిర్మాణ కార్మిక సంఘం ఐదో మండల మహాసభల సందర్భంగా తాడువాయి వెంకటరాంపురం నేలమర్రి మాధవరం గ్రామాలలో మహాసభల కరపత్రాలను ద్వారా ప్రచారం చేస్తూ భవన నిర్మాణ కార్మికులు ఏర్పాటుచేసిన సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో దరఖాస్తు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులను ఇవ్వాలని ఇప్పటికి నెలల తరబడి పెండింగ్లో ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలన చేసి అర్హులైన ప్రతి కార్మికుడికి న్యాయం జరిగే విధంగా చూడాలని 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి వెల్ఫేర్ బోర్డు ద్వారా 9000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలకు పెంచాలని సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని ప్రసూతి మరియు పెండ్లి కానుకల కు లక్ష ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న క్లైమూలకు నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరినారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు షేక్ దస్తగిరి, సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కోలా ఆంజనేయులు సహాయ కార్యదర్శి అల్లి నాగరాజు, మండల కమిటీ సభ్యులు బి రమణయ్య ఆర్ ఏసోబు,బి వెంకన్న పటేల్, ఆర్ వెంకన్న, సైదులు గోవర్ధన్, జీడయ్య,
రాజేష్ జె సుందరయ్య, మంగయ్య, తదితరులు పాల్గొన్నారు.