November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది – పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

పిఠాపురం : మొక్కలు నాటండి – స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందండి అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. శ్రావణ శుక్రవారం ఉదయం వై.ఎస్.ఆర్. గార్డెన్స్, శివ దత్త నగర్, భాష్యం పబ్లిక్ స్కూల్ పరిసరాల్లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క – నా శ్వాస అనే కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ మంతెన సూర్యావతి, అహమ్మద్ ఆలీషా, భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ పోలుపర్తి వేణు, టీచర్ కొండబాబు, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పలువురు కాలనీ ప్రజలు, పీఠం సభ్యులు కూడా పాల్గొని సుమారు 90 మొక్కలు నాటారు. పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా మాట్లాడుతూ మొక్కలు స్వచ్చమైన ప్రాణ వాయువును అందించి, కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తగ్గించి, స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని ప్రసాధిస్తాయి అని అన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రతీ సంవత్సరం 3 మొక్కలు నాటితే, 4 లేదా 5 సంవత్సరాలలో పిఠాపురం హరిత పట్టణంగా మారుతుందని డా ఉమర్ ఆలీషా అన్నారు. భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ వేణు మాట్లాడుతూ తన చిన్నతనం నుండి నా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పిఠాపురం మెయిన్ రోడ్డు డివైడర్ లోపల నాటిన మొక్కలు ఆహ్లాదం అందించుటయే కాక పచ్చిదనం కనిపిస్తోంది అన్నారు. నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాష్యం స్కూల్ వారికి భాగస్వామ్యం కల్పించినందుకు డా. ఉమర్ ఆలీషా స్వామికి ధన్యవాదాలు తెలిపారు. అహ్మద్ ఆలీషా మాట్లాడుతూ వృక్షముల ద్వారా వాతావరణం చల్లబడుతుందని మరియు వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకుని ప్రకృతిని కూడా కాపాడుకోవచ్చు అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ సూర్యావతి మాట్లాడుతూ స్వామి వారి అజ్ఞతో హైదరాబాద్ లో ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో మొక్కలు నాటి, ఈ రోజున ఆ మొక్కలు ఫలాలు, పుష్పాలు అందిస్తున్నాయి అన్నారు. దానివల్ల తమకు ఎంతో సంతోషం ఆనందం కలిగిందన్నారు.

Related posts

ఎల్ ఓ సి అంద చేసిన జువ్వాడి కృష్ణారావు

TNR NEWS

స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

Harish Hs

పెదిరిపాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టిఫిన్ ప్రోగ్రామ్ షురూ…

TNR NEWS

విమాన ప్రమాద మృతులకు నివాళులు

TNR NEWS

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs

సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS