ఎంతోమంది సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టారని, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వారందరినీ స్మరించుకోవడం మనందరి బాధ్యత అని హర్ ఘర్ తిరంగా యాత్ర అనంతగిరి మండల ఇంచార్జ్ వెంకటేష్ బాబు అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అనంతగిరి మండల కేంద్రంలో గురువారం భాజపా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మహనీయులు అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు పూలమాల వ వేసి భాజపా నాయకులు, కార్యకర్తలు మువ్వన్నెల పతాకాలతో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతకుంట్ల సతీష్, జిల్లా నాయకులు వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి సిద్దయ్య, యాకూబ్ ,వికాస్ రెడ్డి ,ఓరుగంటి పురుషోత్తం, రాధాకృష్ణ ,కొల్లు రవి, శ్రీను, భూమా, శ్రీను, మారుతి కొండయ్య, భూత అధ్యక్షులు మండల నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు