Tnrnews.in
క్రీడా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య

క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు  క్రీడల్లో రాణించాలి  జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి  నడిగూడెంలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు కృషి  పదవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

 

నడిగూడెం.

గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ క్రీడా కుసుమాలుగా తయారవుతున్నారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలలకు, గ్రామాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోదాడ ఎమ్మెల్యే నల మాద పద్మావతి రెడ్డి అన్నారు. నడిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారము 10వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల మార్చి ఫాస్ట్ ను స్వీకరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే, బిఆర్ అంబేద్కర్, ఎస్ ఆర్ శంకరన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్రీడల జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహము కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా గురుకుల విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో మంచి ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. నాలుగు రోజులపాటు జరిగే స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులు వివిధ ఆటల్లో ప్రతిభను చాటి పాఠశాలలకు మంచి పేరు తేవాలన్నారు. నడిగూడెం గురుకుల పాఠశాలకు కావలసిన సౌకర్యాలు అన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. నడిగూడెంలో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని ఈ మేరకు తన వంతు కృషి చేస్తానన్నారు. పాఠశాల 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నందున రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించవచ్చున్నారు. ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల సొసైటీ అధికారులతో మాట్లాడుతానన్నారు. విద్యార్థులు ఇప్పటినుంచే క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అన్నారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల నుంచి 9 టీములు స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనేందుకు రావడంతో వారిని ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు. 765 మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు రావడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే తిలకించారు. విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు సన్మానించారు.

 

ప్రిన్సిపాల్ సిహెచ్ వాణి పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూత్కూరు వెంకటరెడ్డి, డి సి ఓ విద్యాసాగర్, ప్రిన్సిపాల్ పద్మ, వెంకటేశ్వర్లు, అరుణకుమారి, విజయలక్ష్మి, ఎంఈఓ ఉపేందర్ రావు, మాజీ జడ్పిటిసి బాణాల కవిత, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బాణాల నాగరాజు, సింగిల్ విండో చైర్మన్ రాజేష్, నాయకులు పుల్లారెడ్డి, నరసయ్య, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైస్ మిల్లుల కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలి

Harish Hs

కానిస్టేబుల్ నుండి కాలేజీ లెక్చరర్ దాకా..

TNR NEWS

అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. -స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి.  -జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించేందుకు వికలాంగుల శ్రేణులు సన్నద్ధం కావాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ 

TNR NEWS

ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికలు కు పటిష్ట బందోబస్తు

TNR NEWS

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?

TNR NEWS

మండల రైతాంగానికి పోలీసువారి విజ్ఞప్తి ధాన్యం సేకరణ ,ఆరబెట్టడం, అమ్మకాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉంది రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ల జాగ్రత్త వహించాలి . మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS