నూతనగా నియమించిన కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ ను టి.పి.సి.సి ప్రచార కమిటీ కో ఆర్డినేటర్, కౌండిన్య గౌడ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రముఖ న్యాయవాది కె.ఎల్.ఎన్. ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిచారు.ఈ సందర్బంగా కె.ఎల్.ఎన్ మాట్లాడుతూ ప్రజా బలం ఉన్న కార్మిక నాయకుడు బషీర్ కు మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా షేక్ బషీర్ అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్, కౌండిన్య గౌడ సంఘం కార్యవర్గ సభ్యులు మొక్క రమేష్ గౌడ్,గుండు వేలాద్రి గౌడ్, యరగాని నాగ శేషు గౌడ్,కారింగుల అరవింద్ గౌడ్,కాసాని వీరబాబు గౌడ్, పుట్ట వెంకటేష్ గౌడ్,కారింగుల శ్రీనివాస్ గౌడ్,యరగాని సతీష్ కుమార్,యరగాని పవన్ కుమార్,కె.ఎల్.ఎన్ యువసేన మిత్రమండలి సభ్యులు తంగెళ్ళపల్లి లక్ష్మణ్, కాసర్ల సత్యరాజు,శీలం ధనేష్ నాయుడు,
చలిగంటి ప్రసాద్,
నంచర్ల జగన్నాథ చారి,బండి సత్తార్, భూమా శ్రీనివాస్, కొండురి వీరయ్య, కావేటి రవి,సట్టు గోపాలకృష్ణ, పొనుగోటి శివ తదితరులు పాల్గొన్నారు.