భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఇళ్లను గుర్తించి ఖాళీ చేయించాలని అధికారులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. అలాగే, నీటి ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
