హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో తెల్లవారుజాము నుండే స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఆకు పూజ, విశేషా అలంకరణ, నీరాజనా మంత్రపుష్పాలు, హనుమాన్ హోమం, పూర్ణాహుతి, తిరొక్క పూలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీరంగాపురం లో గల ఆంజనేయ స్వామి దేవాలయం, వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఉన్న హనుమాన్ ఆలయం, కోదండ రామాలయంలో, బాలాజీ నగర్ లో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కనుల పండువగా నిర్వహించారు.కాగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని. జైశ్రీరామ్, జై హనుమాన్, రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అంటూ జై ఆంజనేయ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి.అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జూకూరి అంజయ్య, సెక్రటరీ తిరుపతయ్య, అన్నదాన నిర్వాహకులు దేవరశెట్టి హనుమంతరావు, బ్యాటరీ చారి ఎల్.ఎన్.రెడ్డి, ఓరుగంటి కృష్ణమూర్తి, శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు…….