డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు, బాధ్యతలను, పదవులను పొందగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి ని పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద శాసనసభ్యులు జగదీష్ రెడ్డి, మందుల సామేల్ సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ వల్లనే అందరికి విద్యతో పాటు సమాన హక్కులు ఆయన రాజ్యాంగమే స్ఫూర్తి ఆని అన్నారు. సమాన విద్య , సమానత్వ హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినవే అని తెలిపారు. దేశంలో, ప్రపంచంలో ఎటువైపు చూసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్కు కనిపిస్తుందన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా డ్రాప్టింగ్ కమిటీని రూపొందించడమే కాకుండా, ప్రాథమిక హక్కులు, సూత్రాలను రాజ్యాంగంలో ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని 1950, జనవరి 26 నుండి పూర్ణ రూపుకు తీసుకువచ్చారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ ను ఈరోజు నుండే అమలులోకి తీసుకురానుందని, ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజని అన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని, దాని ప్రకారమే మనందరం ముందుకెళ్తున్నామని అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి ,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధన కృషి చేయాలన్నారు. చదువును ఆయుధంగా తీసుకొని సామాజిక మార్పును తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఇతర దేశాలకు వెళ్లి చదువుకొని విజ్ఞానాన్ని సంపాదించి మన దేశ పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలో కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం తో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన విలువల ఆధారంగానే మనం ముందుకు వెళ్తున్నామని అన్నారు. అణగారిన వర్గాల కోసం హక్కులు, చట్టాలను రూపొందించి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. నిమ్న కులం లో పుట్టి ఎన్నో అవమానాలకు గురై ,చదువు నేర్చుకుని ప్రపంచ మేధావిగా నిలబడ్డారన్నారు. ప్రపంచంలోనే అనేక రాజ్యాంగాలను చదివి దేశ రాజ్యాంగాన్ని రచించారని, ఎస్సీ, ఎస్టీ ,బీసీ హక్కులను రూపొందించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అలాంటి ప్రపంచ మేధావి మన దేశంలో పుట్టడం అందరికీ గర్వకారణమని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పూర్తిగా సమానత్వం కోసం ప్రజాతంత్ర శక్తులందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అని పిలుపునిచ్చారు.సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామనక్షా అని మనం ఈతకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని శాసనసభ్యులు తెలిపారు. హైదరాబాదులో మరిక్కడ లేనటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు విద్యకు ఉన్న ప్రాధాన్యత కోసం పూలే చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ అందరికీ విద్యా అందించడమే నిజమైన పోరాటమని తెలిపారు చదువు లేకనే దేశం వెనుకబడిందని గుర్తించడం గొప్ప వ్యక్తి స్ఫూర్తిని అంబేద్కర్ తన కార్యచరణలో చూపించారని తెలిపారు దేశానికి అద్భుతమైన మార్గ నిర్దేశం చేసిన అంబేద్కర్ను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని సూర్యాపేట శాసనసభ్యులు తెలిపారు. అనంతరం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే మనందరం ఇక్కడ సమీకరణమయ్యామని దేశంలో జరిగే ప్రగతి సూచికలు రాజ్యాంగం లో పొందుపరిచిన ప్రకారమే జరుగుతున్నాయన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కుల తోటే ప్రజాప్రతినిధి స్థాయికి ఎదిగానని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఎంతో కృషి చేశానని నేటి యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని ఎక్కడైనా సరే విద్యార్థులు చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని పిల్లలను ప్రతి సంవత్సరం హాస్టల్లో చేర్పించి చదివిస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతి కోసం అంకితమై బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అంటరానితనం నిర్మూలన కోసం కృషి చేశారన్నారు. ఎలాంటి అవకాశాలు లేని కాలంలో ఉన్నత చదువులు చదివినారు, విదేశాల్లో విద్యను అభ్యసించారు అన్నారు. ప్రపంచ మేధావిగా పేరు పొందారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానీయుడని కొనియాడారు. దేశ అభ్యున్నతికి ఆయన కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మహానీయులను స్మరింస్తూ మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే వారికి మనం ఇచ్చే నిజమైన ఘన నివాళి అన్నారు. అనంతరం పలు సంఘాల నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరం ముందుకు నడవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఎస్సీ అబివృద్ధి అధికారి లత,డిటిడిఓ శంకర్, డిఎం అండ్ హెచ్ ఓ కోటాచలం,డి ఆర్ డి ఏ పిడి వివిఅప్పారావు,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్ వివిధ సంఘాల నాయకులు చిన్న శ్రీరాములు, తప్పెట్ల శ్రీరాములు, అంజద్ ఆలీ,తదితరులు పాల్గొన్నారు.