Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న కార్మిక నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు లో పెండింగ్ క్లైమూలకు నిధులను విడుదల చేయాలని,బీసీ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమన్న గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం మునగాల మండల ఐదవ మహాసభ సభలో (బీసీ డబ్ల్యూ ) బిల్డింగ్ అదర్ కాంట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎలక సోమన్న మాట్లాడుతూ.. భవనాల బహుళ అంతస్తులు నిర్మిస్తున్న తాపీ మేస్త్రిలు మట్టి పనివారు,రాడ్ బెండింగ్, సెంట్రింగ్,కాంక్రీట్,కార్పెంటర్స్, పెయింటర్స్,టైల్స్,మార్బుల్స్, ఎలక్ట్రిషన్,హౌస్ వెల్డింగ్ మొదలగు వృత్తంలో పనిచేస్తున్న కార్మికుల పాత్ర అమోఘమైనది.దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కొరకు, సీఐటీయూ సహకారంతో అనేక పోరాటాలు చేసిన ఫలితంగా 1996లో భవన నిర్మాణ కార్మిక కేంద్ర చట్టం ఏర్పడిందని,దేశవ్యాప్తంగా వేల్పూరు బోర్డు సంక్షేమ పథకాలను సాధించుకోగలిగాము అని అన్నారు.లేబర్ కోడ్ లను రద్దు చెయ్యాలని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికుల ఐక్యం చేసి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.

సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ క్లైమూలను తక్షణమే పరిష్కరించాలని 55 సంవత్సరాలు దాటిన కార్మికులకు 9000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, పనిముట్లు కొనుగోలుకు ఆర్థిక సహాయం చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరినారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం,షేక్ పాషా, ఎస్.కె సైదా,కోలా ఆంజనేయులు, షేక్ జాన్ పాషా, ఎస్ వీరబాబు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షులు షేక్ దస్తగిరి, కార్యదర్శి నాగరాజు, కోశాధికారి ఎం నాగేంద్రబాబు వీరితో పాటు 25 మందిని నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగింది 9 మంది ఆఫీస్ బేరర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Related posts

పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞాన కేంద్రం ప్రారంభం

Harish Hs

జగిత్యాల జిల్లా యువకుడు గ్రూప్-3, గ్రూప్-1లో ప్రతిభ కనబర్చాడు

TNR NEWS

చేర్యాల మున్సిఫ్ కోర్టు 29 ప్రారంభానికి చక చకా ఏర్పాట్లు

TNR NEWS

సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024 ఏర్పాట్లు సర్వం సిద్ధం…. ఈనెల 19న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం…..

TNR NEWS

*స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.!!*

TNR NEWS

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన.. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

TNR NEWS