గ్రామపంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. కానీ వారు తమ శాఖ పనులతోనే బిజీ ఉండటంతో గ్రామాలను సందర్శించడం లేదు దింతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్తున్నా గ్రామా స్థాయిలో మాత్రం అమలు ఎక్కడా కన్పించడం లేదు. పేరుకే పెద్ద ఊరు కాని పారిశుద్ధం మాత్రం ఎక్కడ కనిపించడంలేదు కంగ్టి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ పారిశుద్ధ్య సమస్యలు తీవ్రమయ్యాయి. డ్రైనేజీ వ్యస్థ చెడిపోయిన రోడ్డు పైన నీరు కనిపిస్తున్నాయి. సైడ్ డ్రైనేజీ సరిగా లేకపోవడంతో రోడ్డు పైన మురికి నీరు బయటకు పొంగిపోవడం, రోడ్డు పైన పరుతున్నాయి. ఎక్కడి చెత్త అక్కడే వదిలేశారు. పిచ్చి మొక్కలు సక్రమంగా తొలగించకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పడేస్తున్న అధికారులు మాత్రం ఏమి తెలియనట్లు వ్యవహారిస్తున్నారు. ఎటు చుసిన చెత్తాచెదారం వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు, ఇతర హానికర కీటకాలు పెరగడంతో ప్రజలకు తీవ్ర ఆనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. నిల్వ ఉండే నీరు వలన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను వ్యాప్తి చేసే ప్రమాదాన్ని పెంచుతోంది. ఈ పరిసరాల కారణంగా కాలనీ వాసులు ఆనారోగ్య సమస్యలతో భయాలతో నివసిస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యలపై సంబంధిత అధికారులు తక్షణం స్పందించి, ఎస్సీ కాలనీలో శుభ్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు కోరుతున్నారు. అధికారులు గ్రామ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం కోసం అవగాహన కల్పించి, పటిష్టమైన పారిశుద్ధ్య నిర్వహణ, పద్ధతులు, చెత్త తొలగింపు వంటి చర్యలు వెంటనే తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.