ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని యోగా గురువు వేనేపల్లి ప్రసాద్ అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.నేటి పోటీ ప్రపంచంలో ఉరుకుల, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ఒత్తిడిని అధిగమించడానికి,శారీరక ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతిరోజు ఒక గంట యోగాకు కేటాయిస్తే శారీరక,మానసిక ఆందోళనలు తగ్గి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.అనంతరం యోగా గురువు వివిధ ఆసనాలు చేపించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో బొల్లు రాంబాబు, కాంపాటి నరసయ్య, పందిరి రఘు వర ప్రసాద్, భ్రమరాంబ, మంగతాయారు, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు………..