November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కమ్యూనిస్టుల పోరాట ఫలితమే శ్రీరామ్ సాగర్ రెండవ దశ నిర్మాణం…  శ్రీరామ్ సాగర్ రెండవ దశకు మాజీ పార్లమెంటు సభ్యులు కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి.  రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్

మోతే :.శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్మాణం చేపట్టాలని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా పోరాటాలు జరిగాయని, ఆ పోరాటంలో మిర్యాలగూడ మాజీ పార్లమెంటు సభ్యుడిగా కమ్యూనిస్టు నాయకుడుగా ఉన్న భీమ్ రెడ్డి నరసింహారెడ్డి విశేష కృషి చేశారని శ్రీరామ్ సాగర్ రెండవ దశ కు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారం ఉన్నదని నెపంతో కమ్యూనిస్టుల పోరాటాన్ని భీమ్ రెడ్డి నరసింహారెడ్డి త్యాగాన్ని విస్మరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టు కోసం ఎలాంటి పోరాటం చేయని రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టడంలో అర్థం లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పోరాటం చేయడం మూలంగా అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి,సూర్యాపేట ప్రాంతాలకు నీరు అందిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమై రైతులు సంతోషంతో వ్యవసాయాన్ని కొనసాగిస్తారని అన్నారు. స్వర్గీయ భీమిరెడ్డి నరసింహారెడ్డి తాను ఎంపీగా ఉన్న సందర్భంలో అనేకసార్లు పార్లమెంటులో తన వాయిస్ ని వినిపించడం జరిగిందన్నారు. పార్లమెంటులో, ప్రజా క్షేత్రంలో అనేక పోరాటాలు సిపిఎం పార్టీ నిర్వహించిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేకసార్లు శ్రీరాంసాగర్ రెండవ దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగిందన్నారు.అందుకే శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్మాణం చేపట్టడంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని దానికి నాయకత్వం వహించిన భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును నామకరణం చేయాలని కోరారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పేరు పెడతామని చెప్పి మోసం చేసిందన్నారు. ఈరోజు తుంగతుర్తి లో జరిగిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలనడం దురదృష్టకరమని విమర్శించారు.

Related posts

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితం

TNR NEWS

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS

సర్వారం సింగిల్ విండో పాలకవర్గం రద్దు…?

Harish Hs

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

TNR NEWS

పల్లె గ్రామాల్లో ఘనంగా ఎలా మాస పండుగా

TNR NEWS

మట్టి వినాయకుణ్ణి పూజించండి… పర్యావరణాన్ని కాపాడండి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra