సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ, ఐపిఎస్ ఆదేశాల మేరకు, కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి గారి అధ్వర్యంలో, కోదాడ సబ్ డివిజన్ షి టీమ్ అధికారి మల్లేష్, ఎస్ ఐ సూచనలతో కోదాడ పట్టణంలో గల పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ షి టీమ్ హెడ్ కానిస్టేబుల్ కవిత మాట్లాడుతూ విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి, బెట్టింగ్ యాప్ లు, ఆన్లైన్ గేమింగ్ యాప్ ల మాయలో పడి తమ భవిష్యత్తు ను పాడు చేసుకోవద్దని సూచించడం జరిగింది. లోన్ యాప్ ల ఉచ్చు లో పడి తమ ప్రాణాలు తీసుకోవద్దని కోరినారు. యువత గంజాయి మత్తులో పడి, దానికి బానిస అయి తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారని తెలియజేశారు.
మేసేజ్ ల రూపంలో గాని, అసభ్యకరమైన పదజాలంతో దూషించడం గానీ, ఫోన్ లు చేసి గాని, మహిళల ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యలకు పాల్పడిన కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించడం జరిగింది. షి టీమ్ గురించి, సైబర్ నేరాల గురించి, షి టీమ్ ను సంప్రదించడం ఎలా అనే విషయం గురించి, అత్యవసర సమయాల్లో చేయవలసిన 100 డయల్ గురించి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ,ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు డి .మార్కండేయ , ఉపాధ్యాయులు బడుగుల సైదులు , ఉపాధ్యాయురాలు పద్మావతి, షి టీమ్ మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి , కానిస్టేబుల్ నాగేంద్ర బాబు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.