కోదాడ సబ్ డివిజన్ షి టీమ్ ఎస్ ఐ మల్లేష్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలపై వేధింపులు జరిగితే షీ టీమ్ నెంబర్ *8712686056* కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.* సైబర్ మోసాలపై *1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు.*”టీ సేఫ్” యాప్ పై మహిళలు అవగాహన కలిగియుండాలని అన్నారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, గంజాయి, గేమింగ్ యాప్ మరియు లోన్ యాప్ లకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు.
ఈ కార్యక్రమం నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవిందయ్య గారు, షీ టీం మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత, సాయి జ్యోతి, నాగేంద్ర బాబు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గోన్నారు.