Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్

సూర్యాపేట టౌన్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురి గోవింద్ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం లో జరిగిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీసమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే వేగవంతం చేసి ఇల్లు లేని పేదలకు ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా చేయాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారని అవి ఏ మూలకు సరిపోవు అన్నారు. నియోజకవర్గానికి పదివేల ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇండ్ల నిర్మాణం పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల కు నేటికీ బిల్లులు రాలేదని ప్రభుత్వం వెంటనే వాటికి కూడా బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని ప్రజలు ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం తక్షణమే భూమి కొనుగోలు చేసి ఇంటి స్థలం లేని పేదలకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలని కోరారు. రేషన్ కార్డులు లేక గత పది సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ప్రకటనకు మాత్రమే పరిమితమైంది తప్ప సంవత్సర కాలంగా ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు చేసిన పాపాన పోలేదు అన్నారు. తక్షణమే అర్హులందరికీ రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఈ సమావేశంలో సిపిఎం పార్టీ వన్ టౌన్ పట్టణ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ మామిడి పుల్లయ్య పిట్టల రాణి ఒట్టే ఎర్రయ్య కప్పల సత్యం మాధగోని మల్లేష్ టేకుల సుధాకర్ రాచూరి జానకిరాముల పోతురాజు లక్ష్మి మారయ్య గోపయ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

ముస్తాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో రైతు పండగ సంబరాలు.  

TNR NEWS

దళిత ప్రధాన ఉపాధ్యాయులు రాములు పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి – ఉపాధ్యాయ, దళిత ప్రజా సంఘాల డిమాండ్

TNR NEWS

వెలగని హైమక్స్ లైట్స్

TNR NEWS

గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 9 వ వార్డు పరిశీలన

TNR NEWS

జిల్లాలో గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

Harish Hs

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం గురించి అవగాహన – జిఎంఆర్ విద్యాసంస్థల రెస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి

TNR NEWS