Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెండింగ్లో ఉన్న పిఆర్సి,డిఏ లను విడుదల చేయాలి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై 23న హైదరాబాదులో జరిగే ధర్నాకు ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కోదాడ పట్టణంలో టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు సభ్యత్వాలను అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా సమస్యలతో వెనుకబడిపోయిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.పెండింగ్లో ఉన్న పీఆర్సీలు డీఏలను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పాండురంగ చారి, కోదాడ టౌన్ ప్రధాన కార్యదర్శి సైదిరెడ్డి, కోదాడ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మైసయ్య, శ్రీనివాసరావు, బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు……….

Related posts

విద్యార్థులు మాదక,ద్రవ్యాల మత్తులో పడవద్దు!  పరకాల ఏసీపీ సతీష్ బాబు

TNR NEWS

వెలగని హైమక్స్ లైట్స్

TNR NEWS

అనంతగిరిలో ఘనంగా తిరంగ యాత్ర

TNR NEWS

ఘనంగా హోలీ సంబరాలు

TNR NEWS

ఘనంగా సెమీ క్రిస్మస్ శాంతి సంతోషాలకు చిహ్నం క్రిస్మస్

TNR NEWS

యువకుడి అదృశ్యం

TNR NEWS