కొమురవేల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వాయర్ నీటితో చేర్యాల ప్రాంత చెరువులు కుంటలు నింపాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు.చేర్యాల సిపిఎం పార్టీ ఆఫీస్ లో జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మావో అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేర్యాల ప్రాంతంలో ఉన్న చెరువులు కుంటలు నింపడం కోసం నిర్మించిన తపాస్ పల్లి రిజర్వాయర్ నీటిని కాంగ్రెస్ నాయకులు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి నీటిని యదేచ్చగా తీసుకుపోతుంటే స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఏం చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.చేతకాని వారిలాగా చూస్తూ కూర్చున్న కాంగ్రెస్ నాయకులు జేఏసీ పేరుతో రైతులను మోసగించే ప్రకటనలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే నీటిని తీసుకుపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు.తపస్ పల్లి రిజర్వాయర్ నీటిని చేర్యాల ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులు కుంటలు కాలువల ద్వారా నింపాలని కాలువల లేని చెరువులకు కాలువలు తవ్వి నింపాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులను ప్రజలను ఏకంచేసి ఈ ప్రాంత చెరువులు కుంటలు నింపే వరకు ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామని ఆయనే హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తాడూరు రవీందర్ బద్దిపడగ కృష్ణారెడ్డి దాసరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.