సురవరం సుధాకర్ రెడ్డి మృతి భారతదేశానికి తీరనిలోటు అని సిపిఐ మండల కార్యదర్శి చిల్లంచర్ల ప్రభాకర్ అన్నారు. శనివారం చిల్లంచర్ల రఘునాథం స్మారక భవనం, సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో ఉద్యమం బాట పట్టి విద్యార్ధి నాయకుడిగా యువజన సంఘం నాయకుడిగా, భారత కమ్యూనిస్టు పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా సురవరం సుధాకర్రెడ్డి పేద ప్రజల కోసం పనిచేశారని అన్నారు. సమాజంలో పేదలు, కార్మికులు, రైతులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించడంతో పాటు చట్ట సభలలో పోరాడారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్న రామయ్య, రాఘవరెడ్డి, శ్రీను, తండు శ్రీను, సిపిఎం నాయకులు బుర్రి శ్రీరాములు, చందా చంద్రయ్య, బచ్చలకూరి స్వరాజ్యం, బిఆర్ఎన్ నాయకులు కందిబండ సత్యనారాయణ, ఉడుం కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పుల యుగంధర్ రెడ్డి,కాసర్ల వెంకట్, కె ఆర్ ఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ అర్వపల్లి శంకర్ పాల్గొన్నారు.