హైదరాబాద్ : మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ మరియు జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఘట్టుపల్లి ఆశ్రమంలో మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రసాయనరంగులతో తయారుచేసిన విగ్రహాలను వాడడంతో పర్యావరణం కాలుష్యం అవుతుందని అందుచేత ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఇంటి లక్ష్మీదుర్గ, ఘట్టుపల్లి ఆశ్రమ సభ్యులు స్వర్ణలత, సూర్యలత తదితరులు పాల్గొన్నారు.