Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సైబర్ నేరాల పై అవగాహన

*ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట DSP శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, కోదాడ షీ టీం వారు చిలుకూరు మండల కేంద్రంలోని గేట్ కళాశాల లో షీటీమ్స్, సైబర్ నేరాల పై పోలీసు కళాభృందంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది* 

 

 *కోదాడ షీ టీం మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపిఎస్ అధ్వర్యంలో షీ టీమ్స్,సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి.సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు‌.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు.యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. పుట్టిన తేదీలను,ఫోన్ నెంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు.సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు.

అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు

ఈ కార్యక్రమంలో గేట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.రామారావు , డాక్టర్ డి.రవీందర్,కోదాడ షీ టీం మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి, కానిస్టేబుల్ నరేంద్రబాబు, పోలీస్ కళాబృందం ఇంచార్జి యల్లయ్య,సభ్యులు గోపయ్య, చారి, నాగార్జున, కృష్ణ, విద్యార్థిని, విద్యార్థులు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

TNR NEWS

సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలి…..  రవాణా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి….  మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతి పత్రం అందజేత..  తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు

TNR NEWS

రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలాది ద్వంద వైఖరి

Harish Hs

వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలి

Harish Hs

*తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యం గా కుల గణన చేపట్టాం-ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*

TNR NEWS

*విద్యా దినోత్సవం సందర్భంగా, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు*

TNR NEWS