Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నోట్ః ఈ ఐటమ్‌ను తప్పకుండా వాడుకోగలరు విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటా   రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తా  జోగిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆకుల చిట్టిబాబు 

విశ్రాంత ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సంక్షేమం కోసం రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తానని అందోల్‌ జోగిపేట మున్సిపల్‌ 17వ వార్డ్‌ కౌన్సిలర్‌ ఆకుల చిట్టిబాబు అన్నారు. తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం సంఘం భవనంలో నిర్వహించిన విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా ఆహాజరై ప్రసంగించారు. మా కుటుంబం కూడా ఉపాధ్యాయ కుటుంబమేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మా నాన్నగారు ఆకుల అంజయ్య నిస్వార్ధంగా, మా తండ్రి ఆకుల అంజయ్య ప్రధానోపాధ్యాయుడిగా నిజాయితీగా ఉపాధ్యాయ భాద్యతలను చేపట్టారని అన్నారు. మీ మద్యలో రిటైర్డ్‌ ఉద్యోగిగా లేకపోవడం చాలా భాద కలిగిస్తుందన్నారు. ఆయన స్మారకంగా మీరు ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహయాన్ని అందిస్తానన్నారు. ఆయన మాకు మా తండ్రి గారే స్పూర్తియని, ఆయన చూపెట్టిన మార్గంలో నడవడం వల్ల తామంతా ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. మా ఎదుగుదలను చూసేందుకు ఆయన ఉండి ఉంటే ఎంతో సంతోషపడేవాడని భావోద్వేగానికి గురయ్యారు. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపై ఉండాలని కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరు గురువులను గౌరవించాలని ఆయన సూచించారు. డబ్బు కంటే ప్రేమ ఎంతో గొప్పది అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు సేవ చేస్తే వారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన సూచించారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులను ఆయన శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చిట్టిబాబును శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ప్రేమ్‌ కుమార్, మనోహర్‌ ప్రసాద్, సభ్యులు వీరేశం, భూమయ్య, రామ్‌ రెడ్డి, నర్సింలు, పండరయ్య, రాధాకృష్ణాగౌడ్, శేఖర్, దుర్గారాం, సత్తయ్య, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Related posts

*విద్యా దినోత్సవం సందర్భంగా, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు*

TNR NEWS

దళిత ప్రధాన ఉపాధ్యాయులు రాములు పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి – ఉపాధ్యాయ, దళిత ప్రజా సంఘాల డిమాండ్

TNR NEWS

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS

లగచర్ల లో జిల్లా కలెక్టర్, అధికారుల పై దాడినీ   తీవ్రంగా ఖండిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య 

TNR NEWS

వేనేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్

Harish Hs

కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Harish Hs