వివేకానంద స్పూర్తితో యువత ముందుకు సాగాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. గుమ్మడిదల మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ప్రాథమిక పాఠశాల ఎదురుగా సిజిఆర్ ట్రస్ట్ ద్వారా తన సొంత నిధులతో స్వామి వివేకానంద నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు యువకుల సమక్షంలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు భారతదేశ గొప్పతనాన్ని స్ఫూర్తిని చాటి చెప్పిన మహానీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నేటితరం యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తన ట్రస్టు ద్వారా సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గ్రామ దేవాలయ కమిటీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి మల్లారెడ్డి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి రమణారెడ్డి మొగులయ్య మంద భాస్కర్ రెడ్డి బాలకృష్ణారెడ్డి సూర్యనారాయణ సత్యనారాయణ రవీందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జయపాల్ రెడ్డి ఉదయ్ కుమార్ రామ్ రెడ్డి వెంకట్రాంరెడ్డి వాసుదేవరెడ్డి ఆంజనేయులు యాదవ్ మహిపాల్ రెడ్డి అయూబ్ బాల్రెడ్డి మురళి చంద్రారెడ్డి అరవింద్ రెడ్డి తుడుం రవి బాబు యాదవ్ నవీన్ సాగర్ మేకల రవీందర్ కంది రాము శ్రీకాంత్ గౌడ్ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు