సీపీఐ జాతీయ నాయకుడు కామ్రేడ్ సురవరం సు ధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు, భారత కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటని కమ్యూనిస్టు పార్టీ కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు శుక్రవారం మున్సిపల్ పరిధిలోని తమ్మర బండ పాలెం లో కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమంతరావు పాల్గొని సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజ కీయాల వరకు తన చివరి శ్వాస వ రకు రాజీపడని నిరాడంబర జీవి తం , తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేశారని గుర్తు చేశారు ఏఐఎస్ఎఫ్ నుంచి కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినా, ఏనాడూ అహంకారం,అహంభావం తన దరిదాపుల్లోకి రానయకుండా సామాన్య జీవితం గడిపిన గొప్ప నాయకుడు అని కొనియాడారు తమ్మర గ్రామ శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొల్లు ప్రసాదు, ఏఐటియుసి ప్రాంతీయ నాయకులు పోతురాజు సత్యనారాయణ ,సిపిఐ సీనియర్ నాయకులు గొట్టిముక్కల కోటి నారాయణ , కమతం పుల్లయ్య, గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు కొండ కోటేశ్వరరావు, నిడికొండ రామకృష్ణ, సిపిఐ నాయకులు పసుపులేటి గోవిందరావు, బత్తినేని శ్రీనివాసరావు, రాయపూడి కాటమరాజు, గోసు దిబ్బయ్య, మల్లారెడ్డి గూడెం బాబు, తదితరులు పాల్గొన్నారు.