కోదాడ పట్టణం లోని ఉర్దూ స్కూల్ సమీపం లో నివాసం ఉంటున్న అనాధ రాజమ్మ అనే ముసలమ్మ మరణించగా అన్నీ తామే అయ్యి ముస్లిం యువకులు రాజమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ యువకులు మాట్లాడుతూ సహాయం చేయడానికి గొప్ప మనసు ఉంటే చాలని కులం,మతం,గోత్రం తో పని లేదన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం మృతురాలిని ఖననం చేయటం తో పలువురు పట్టణ ప్రజలు ఆ యువకులను అభినందించారు.