అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పాలన సాగిస్తున్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వలు రెండు రైతుల పట్ల ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నాయని కొడంగల్ మాజీ ఏమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు.
సీఎం సొంత నియోజకవర్గం లో యూరియా కొరత పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీ శ్రేణులతో కలిసి మద్దూర్ చౌరస్తా లో ధర్నా చేసిన మాజీ ఏమ్మెల్యే గారు పట్నం నరేందర్ రెడ్డి
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…..
తెలంగాణ లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదన్నారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరత్తనట్లు వ్యవహారిస్తుందని ఆరోపించారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చెయ్యడం విడ్డురంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేయ్యాలన్నారు. ఆరు గ్యారంటీ ల ఊసే లేదని, 420 హామీలతో తెలంగాణ ప్రజల్ని నిండా ముంచిందన్నారు. పాదయాత్ర లో తులం బంగారం, స్కూటీలు, నిరుద్యోగ భృతి, పెంచిన పెన్షన్ ఏ ఒక్కటి హామీ అమలు కాలేదన్నారు. రైతు భరోసా, రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. నువ్వు కొట్టు, నేను ఏడుస్తా అన్నట్లుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలా వైఖరి ఉండడం బాధకారం అని అన్నారు. తెలంగాణ మళ్ళీ పునర్వభవం కావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, ఏనాటికైనా తెలంగాణకు కేసీఆర్ యే శ్రీ రామ రక్షా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు మండలాల అధ్యక్షులు మరియు గ్రామాల మరియు BRS ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు