జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ పరిధిలో శ్రీ మల్లన్న జాతరను ఆలయ నిర్వహకులు గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కొలన్ బాల్రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.. అనంతరం వారిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాలకత్వ గ్రామ ప్రజలు ఆలయ నిర్వహకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
