పిఠాపురం : జిల్లాలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాంప్ పథకం ద్వారా పిఠాపురం బొజ్జావారి తోటలో సెప్టెంబర్ 8 సోమవారం నుండి ఉచితంగా 30 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం ఇంచార్జ్ వి.ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ వరల్డ్ బ్యాంకు సౌజన్యంతో త్రెర్జ్ ఐటీ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని, స్వయం ఉపాధి అవకాశాలు మరియు ప్రాజెక్టు తయారీ విధానం, మార్కెట్ అవగాహన, పరిశ్రమ ఏర్పాటు, ఆన్లైన్ బిజినెస్, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ లోన్ పై సమాచారంతో పాటు శిక్షణ ఇస్తున్నారని, శిక్షణ అనంతరం ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సర్టిఫికెట్ లభిస్తుందన్నారు. ఈ ఉచిత శిక్షణలో పాల్గొనదలిచిన వారు 18 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన వారు మరియు ఆసక్తి కలిగిన వారు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, కుల ధృవీకరణ పత్రం, విద్యా అర్హత ధ్రువ పత్రం తీసుకొని పిఠాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ని సంప్రదించగలరని, మరిన్ని వివరములకు 9951447776, 9182293256 ఈ మొబైల్ నెంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ అవకాశం పిఠాపురం నియోజకవర్గ నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

previous post