Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఆవిర్భావ సభను విజయవంతం చేయండి – జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్

పిఠాపురం : నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజవర్గ పరిశీలకులుగా దాసరి రాజు, పి.ఎన్.రాజులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించినట్లు ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ గ్రామాల వారిగా సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జరుపుకునే మొదటి పండుగను ఘనంగా జరుపుకోవాలని తెలియజేశారు. చోడవరం ఇంచార్జ్ పి.ఎన్.రాజు మాట్లాడుతూ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే కమిటీలు నియమించడం జరిగిందని, ఈ కమిటీలతో పాటు ఆహ్వాన కమిటీని కూడా ఏర్పాటు చేశామని, మీరందరూ సమన్వయంతో పనిచేసి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఘన స్వాగతం పలికి ఆతిథ్యాన్ని అందించాలని ఆయన కోరారు. అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేసి 1,24,702 (62.59%) ఓట్లు సాధించి, 77,421 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించడంతో చేబ్రోలు జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మరియు ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజవర్గ పరిశీలకులుగా నియమించిన దాసరి రాజు, పి.ఎన్.రాజు తదితరులు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు కృషి చేసిన ప్రతీ ఒక్క జనసేన నాయకుడికి, కూటమి నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.

 

Related posts

ఘనంగా ఆదిత్యలో ఐఎన్ఎస్పిఐఆర్ఏ (ఇన్స్పిరా) అకాడమిక్ ఫెయిర్

ట్రూడౌన్ గా విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

Dr Suneelkumar Yandra

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం గోడ పత్రిక ఆవిష్కరణ

Dr Suneelkumar Yandra

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు. జిల్లా డిఎంహెచ్వో వెంకట రవణ.

TNR NEWS