కోదాడ పట్టణంలోని శివ సాయి నగర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.శుక్రవారం నిమజ్జనం సందర్భంగా మహిళలు కోలాటాలతో స్వామివారిని ఊరేగించారు. పాలాభిషేకం, జలాభిషేకం నిర్వహించి, ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వాడాలని సూచించారు.