కోదాడ మండల పరిధిలో గుడిబండ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు.అదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆంజనేయస్వామి దేవాలయం ప్రక్కన చెట్ల పొదల్లో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు వారిని పట్టుకుని,వారి నుంచి రూ. 2 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.పేకాట ఆడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.