తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సందర్భంగా మునగాల మండలం నరసింహులగూడెం గ్రామంలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేస్తూ నివాళులర్పిస్తున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు జూలకంటి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం భారతదేశానికి సమాజ మార్పులలో మహిళల హక్కుల పరిరక్షణలో అగ్రగామిగానిలిచిన మన మల్లు స్వరాజ్యం సమాజానికి చేసిన సేవలకు అందరి మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు చిన్నతనంలోనే ఆమెకు సమాజసేవ పట్ల నిబద్ధత ఏర్పడింది పేదల హక్కులు కాపాడటమే కాకుండా మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అంతం వారు చేసిన ఉద్యమాలు నిర్వహించిన పోరాటాలు యువత కోసం చేసిన కార్యాలు మన అందరికీ మార్గదర్శకంగా నిలిచాయి ప్రతి మహిళా ప్రతి పేదవాడు సమాజంలో సమాన హక్కుల పొందాలని ఆమె ఎప్పటికప్పుడు చెప్పేవారు ఆమె చేసిన కృషి వల్ల ఈ సమాజంలో మార్పులు మొదలయ్యాయి మల్లు స్వరాజ్యం గారి పని పోరాటాలు మన వంతు బాధ్యతలు గుర్తుచేస్తాయి ఈరోజు ఆమెను స్మరించుకుంటూ ఆమె చూపిన మార్గంలో మనమందరము నడుచుకుంటూ సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆశిస్తున్నాము అని అన్నారు ఈ కార్యక్రమంలో సాయమ్మ , రేణుకా , నాగమ్మ , మణెమ్మ , సునీత ఇంకా పలువురు మహిళలు పాల్గొన్నారు.