Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తాదాన శిబిరం

  • లయన్ డా వి.సురేష్ కుమార్ సేవలను కొనియాడిన ప్రముఖులు

 

హైదరాబాద్ : గ్లోబల్ ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ నోబెల్ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ డా వి.సురేష్ కుమార్ ఎల్లారెడ్డి గూడ, కాప్రాలో రక్తదాన శిబిరం మరియు నిరుపేదలకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని బిఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి కనకరాజ్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, లయన్స్ క్లబ్ అఫ్ నోబెల్ సభ్యులు, కాలనీ పెద్దలు మాట్లాడుతూ లయన్ డా వి.సురేష్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవలో నిమగ్నమై తన గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా ఎనో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరం ద్వారా రక్తాన్ని అందించి ప్రాణదాతగా నిలవడం గర్వించదగ్గ విషయం, రాబోయే రోజుల్లో ఇంకా తన గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ ప్రతినిధులు జనపరెడ్డి రవీందర్, తాటి శ్రీనివాస్, బాలకృష్ణ జనార్దన్, బిఆర్ఎస్ నాయకులు బైరి భాస్కర్ గౌడ్, నిఖిల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి కనకరాజ్ గౌడ్, గ్లోబల్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ ముప్పుడి హరీష్, గ్లోబల్ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కొమురవెల్లి శ్రీనివాస్, కోర్డినేటర్ యలమంచిలి వరుణ్, గ్లోబల్ ఫౌండేషన్ ఉమెన వింగ్ ప్రెసిడెంట్ పందిరి శిరీష, యాంకర్ ఉమా, వివేకానంద బ్లడ్ బ్యాంక్ విపి సంజీవ్, కాలనీ పెద్దలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

1008 మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన ఆర్యవైశ్య సంఘం

Dr Suneelkumar Yandra

లక్ష తెల్లజిల్లేడు పువ్వులతో ఉచ్ఛిష్ట గణపతికి చతుర్థి నీరాజనం

Dr Suneelkumar Yandra

మెడికల్ విద్యార్థినులకు శశిధర్ ఆర్థిక చేయూత

TNR NEWS

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నైపుణ్య‌శిక్ష‌ణ ల‌క్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు*

TNR NEWS

వజ్రకవచధర గోవింద గోవింద

Dr Suneelkumar Yandra

పిఠాపురం నియోజక వర్గం పల్లెలకు రహదారి కళ