పిఠాపురం : జనసేన నాయకుడు, జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ జన్మదిన వేడుకలు పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా స్థానిక మోహన్‌నగర్ వద్ద ఉన్న టిడ్కో గృహాల వద్ద మహిళలు, జనసేన నాయకులు కేకును కట్‌చేసి ఆయన జన్మదిన వేడుకలు జరిపారు. సొంత ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ టిడ్కో గృహాలు మంజూరు చేయడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎం.డి.అహ్మద్, కామాక్షి, లక్ష్మి, భవాని, మణి, కుమారి, వీరబాబు, సుదర్శన్, ఇస్మాయిల్, గోపి తదితరులు పాల్గొన్నారు.