వాసవి క్లబ్ కోదాడ వారి ఆధ్వర్యంలో సోమవారం నాడు కోదాడ యం యస్ కళాశాలలో డిస్ట్రిక్ట్ వి 104A గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి గవర్నర్ అధికారిక పర్యటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి ముందుగా వాసవి క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని వారిని శాలువాలతో సన్మానించి, మెమెంటో సర్టిఫికెట్ అందజేశారు.
ఈ కార్యక్రమానికి అతిధులుగా MS కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి ,బిక్కుమళ్ల కృష్ణ,మిట్టపల్లి భాస్కర్ ,సామ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాతల సహకారం తో ఒక బీద కుటుంబానికి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం
(దాత : కాటేపల్లి నరసింహారావు),
5 గురు మహిళలకు చీరల పంపిణి (దాత : మహాలక్ష్మి శారీస్ & డ్రెస్సెస్ ,కోదాడ),5 గురు బీద మహిళలకు ఒక్కొక్కరికి 200 చొప్పున పెన్షన్లు పంపిణి ( దాత: పోలిశెట్టి నవీన్ కుమార్, ఐపిసి ),30 మంది విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణి (దాత : దేవరశెట్టి చిన్న బ్రహ్మం,కోదాడ ) అందజేయడం జరిగింది.కార్యక్రమాలకు సహకరించిన దాతలను శాలువాల తో సన్మానించడం జరిగింది .
ఇట్టి కార్యక్రమం లో వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు, సెక్రటరీ పత్తి నరేందర్, కోశాధికారి వెంపటి ప్రసాద్ మరియు వివిధ హో,దాలలో ఉన్న ఐపీసీలు , డి ఐ,డీపీఓలు ,ఆర్ సి,జడ్ సి ,ఆర్ ఎస్ పలువురు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.