పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామపంచాయతీ శివారు పాత దడాలపాలెంలో ఉన్నటువంటి సొంత జిరాయితి భూమి రెండు ఎకరాల 9 సెంట్లు సర్వేనెంబర్ 341-1 మా తాత ముత్తాత తండ్రి నుండి ప్రస్తుతం మేము మా అన్నదమ్ములు అందరం సుమారు నాలుగు కుటుంబాలు అనగా 20 మంది అనుభవిస్తున్నామని ఈ మధ్యకాలంలో ఆ భూమిపై కాకినాడ ఎస్ ఈ జెడ్,అరవింద ఫార్మా వారు అక్రమంగా వాళ్లు దోచుకోవాలని ఉద్దేశంతో సోమవారం ఉదయం జెసిబి తీసుకొని
మాపల సాయంతో ఉన్న పొలం త్రవ్వేసారని మాకు సమాచారం తెలియడంతో హుటాహుట్ అక్కడికి వెళ్లిమీకు ఏ హక్కు ఉందని నా పొలం దున్నేస్తున్నారు నా దగ్గర ఉన్న భూమి దస్తాపత్రాలను వారు కి చూపించగా మధ్య వ్యక్తిగా వచ్చిన సెక్యూరిటీ మేనేజర్ వచ్చి ఆయన మాటతో మా పొలం నుండి జెసిబి తీసుకుని వెళ్లిపోయారని అన్నారు. గతంలో దీనిపై మండల రెవెన్యూ అధికారి వారికి దరఖాస్తు పెట్టుకున్నామని ఈ మధ్య కాలంలో అడంగల్ ఈ సి తీయించమని ఇవన్నీ కూడా మా వారసులు పేరు మీద ఉన్నాయని ఇది ఎక్కడ అన్యాయమని దళితులను హేళనగా అరబిందో ఫార్మా యాజమాన్య ప్రవర్తిస్తుందని బాధితులు వడ్డీ రాజేశ్వరరావు.. చిన్న అప్పారావు చినబాబు.. అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ సమస్యపై మండల రెవెన్యూ అధికారి వారిని కలుస్తామని మాకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు.