మద్దూరు మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ వర్ధ0తిని సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో సీపీఎం మండల కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటంలో నైజాం పాలనకు దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా భూమి భూక్తి వెట్టికిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగా పోరాటంలో ఐలమ్మ పాత్ర చిరస్మరణీయం అని కొనియాడారు.తెలంగాణ తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారని పది లక్షల ఎకరాల భూమి పంచరని మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు స్థాపించి నిజాం ను గద్దే దింపింది కమ్యూనిస్టులేనని అన్నారు.నేటి యువత చాకలి ఐలమ్మ ఆశయ సాధన లో కలిసి రావాలని అన్నారు. కార్యక్రమం లో నాయకులు హన్మంతు, కేశవులు, దళిత బహుజన నాయకులు చిన్నయ్య సాయిలు, రాములు,నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.